ఒకరి ఫోన్ లను మరొకరు చెక్ చేయడం.. రిలేషన్‌కు ఎంతవరకు మేలు చేస్తుంది..!

Publish Date:Nov 29, 2025

Advertisement

 



ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు. నిజానికి ఇలా పోన్ చెక్ చేయడం అనే విషయం కారణంగా గొడవలు పెరిగి భార్యాభర్తల మద్య నమ్మకం కోల్పోయి, విడిపోవడానికి దారి తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోన్ చూడటంలో ఏముంది?  ఇదేం పెద్ద విషయం కాదే.. అన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. కానీ ఇది బయటకు వివరించలేని సమస్యలను క్రియేట్ చేస్తుంది. అసలు భార్యాభర్తలు  ఒకరి ఫోన్ ను మరొకరు చెక్ చేయడం అనే విషయం బంధాన్ని ఎంత దెబ్బతీస్తుందో దీని వల్ల కలుగుతున్న నష్టాలేంటో తెలుసుకుంటే..

పెళ్లైపోయింది.. భార్యాభర్తలు అయిపోయాం.. ఇక నీకు నాకు మధ్య దాపరికం ఏముంటుంది? ఫోన్ చూస్తే తప్పేంటి? ఇది చాలా మంది బార్యలు లేదా భర్తలు చెప్పే మాట. ఇందులో నిజమే ఉన్నా.. పోన్  లో ఏదో దాపరికం లేదా రహస్యం ఉంటుంది కాబట్టే ఫోన్ చూడద్దు అని అంటున్నారు అనుకోవడం చాలా పొరపాటు.

ఫోన్.. వ్యక్తిగతం..

చాలమంది ఫోన్ లో పర్సనల్ ఉంటుంది అనుకుంటారు. ఇది చాలా వరకు అందరూ కరెక్ట్ అనుకుంటారు. నిజానికి వ్యక్తిగతం అనేది జీవితానికి సంబంధించిన విషయం. కానీ ఫోన్ లో ఉండేది కేవలం సోషల్ మీడియా జీవితం.  స్నేహితులతో చాటింగ్ చేసినా, ఆఫీసు వ్యక్తులతో కాంటాక్ట్ అవుతున్నా,  ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నా, ఫోన్ లు మాట్లాడుతున్నా అవన్నీ ఔటాఫ్ రిలేషన్ విషయాలు.  పదే పదే ఫోన్ చూడటం, విషయాల గురించి గుచ్చి గుచ్చి అడగటం,  బయటి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడటం వంటివి బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఇలా మాట్లాడటం వల్ల బంధంలో నమ్మకం బలహీనం అవుతుంది.

తప్పేం కాదు... కానీ..


భార్యాభర్తలు ఒకరి ఫోన్ ను మరొకరు చూడటం తప్పేమీ కాదు..కానీ  ఒకరిని మరొకరు అనుమానించినట్టు, అవమానించినట్టు బిహేవ్ చేయడం మాత్రం చాలా తప్పు. చాలామంది మగాళ్లు పెళ్లయ్యాక భార్య గురించి ప్రతిదీ తనకు తెలియాలని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి వ్యక్తికి కొన్ని మినహాయింపులు ఉండాలి.  

నమ్మకం.. అనుమానం..

పదే పదే విసిగిస్తుంటే దాన్నివేదింపుగా అనుకుంటారు. ఇదే నెమ్మదిగా అనుమానం అనే జబ్బుగా మారుతుంది.  కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఏ విషయాన్ని అయినా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటే అసలు అనుమానం అనే మాటే ఇద్దరి మధ్య ఉండదు.  నువ్వు తప్పక చూపించాల్సిందే లాంటి డిమాండ్లు లేకుండా వారి పోన్ లు చూపించమని అడగడానికి ముందు మీరే వారికి మీ పోన్ చూపిస్తూ ఉంటే  వారిలో క్రమంగా మార్పు వస్తుంది. అప్పుడే నమ్మకం బలపడుతుంది.

ఇగో నే.. గోల..

చాలామంది ఇలా పోన్ చూడటం అనే విషయాన్ని క్యారెక్టర్ ను అవమానించడం,  అహం దెబ్బతినడం అని చెబుతూ ఉంటారు. నిజానికి నేటి జెనరేషన్ లో  ఇగో వల్లనే బంధాలు దెబ్బతింటాయి. అయితే ఇగోను పదే పదే రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు.  పెళ్లైన కొత్తలో మాత్రం ఇలాంటి విషయాలలో ఎంత లైట్ గా ఉంటే అంత మంచిది.  

ఒకప్పుడు..

భార్యాభర్తల మధ్య దాపరికం ఏముంటుంది? మేమేమన్నా అలాగే చేస్తున్నామా అని వెనుకటి తరం వాళ్లు చెబుతుంటారు.  కానీ స్మార్ట్ ఫోన్ లు అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ తరం వేరు.. బంధం ముడిపడ్డాక ఆ బంధం బలపడాలంటే అన్ని విషయాలు గీసి రెచ్చగొట్టుకోవడం ఆపాలి. అందుకే ఈ జెనరేష్ వాళ్లు బంధం బాగుండటానికి ఇతర విషయాలను పట్టించుకోవడం మానేయాలి.

ఆధారపడటం..

భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆధారపడటం అనేది బంధాన్ని నిలబెట్టే విషయం.  భార్య ఇంటిపని, వంట పని చేసి భర్తకు అన్ని సమకూర్చడంలో అతను భార్య మీద ఎలా ఆదారపడతాడో.. తనకు కావలసిన వస్తువైనా, వేరే ఏదైనా భర్త ను అడగడం పట్ల భార్య అలాగే ఉండాలి.  

డబ్బు..  

బార్యాభర్తల మధ్య డబ్బు కూడా చాలా పెద్ద గొడవలు సృష్టిస్తుంది.  భార్య తనది కాబట్టి ఆమె కష్టార్జితం తనదే అనుకునే భర్తలు ఉంటారు.  తాను సంపాదిస్తున్నాను కాబట్టి భర్త జోక్యం చేసుకోకూడదు అనుకునే భార్యలు కూడా ఉంటారు. కానీ బార్య సంపాదించినా అవసరం, సందర్భం వస్తే ఆమె ఎప్పుడైనా ఇచ్చేది భర్తకే.. అలాగే భర్త కూడా ఎప్పుడూ తను సంపాదించే డబ్బుతోనే  భార్యను చూసుకోవాలని,  బార్య సంపాదన పర్మినెంట్ అనే ఆలోచన చేయడం మానుకోవాలి.  

పైనల్ గా.. భార్యాభర్తలు ఒకరి పోన్ ఒకరు చూడటం తప్పు కాదు.. అలాగని పోన్ చూడకపోవడం, చూడనివ్వకపోవడం అంటే అందులో ఏదో రహస్యం ఉంటుందని కాదు.. అర్థం చేసుకోవడం, ప్రాముఖ్యత ఇవ్వడంలోనే అంతా ఉంటుంది.  కానీ ఎప్పుడూ అనుమానాన్ని ప్రోత్సహించకూడదు.  

                             *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.